ఏపీలో బీఆర్ఎస్ పోటీపై కవిత ఏమన్నారంటే..!
- బాస్ కా హుకూం అంటూ కేసీఆర్ ఫొటోతో జవాబు
- తెలంగాణలో బీఆర్ఎస్ కు 95 నుంచి 105 సీట్లు వస్తాయని దీమా
- నిర్మల్ జిల్లాలోని కుంటాల జలపాతం తన ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ అని వెల్లడి
తన వ్యక్తిగత అభిరుచులనూ కవిత నెటిజన్లతో పంచుకున్నారు. రాష్ట్రంలో తనకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతం నిర్మల్ జిల్లాలోని కుంటాల జలపాతం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను ప్రస్తావించిన మరో నెటిజన్ కు సమాధానంగా.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కవిత స్పష్టం చేశారు. బీజేపీకి బీ టీమ్ అన్న ఆరోపణలను ఖండించారు. తమ పార్టీది తెలంగాణ టీమ్ అని, బీజేపీ తమకు రాజకీయ ప్రత్యర్థి అని తేల్చి చెప్పారు.