ఏపీలో 4 కోట్లకు పైగా ఓటర్లు.. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ!
- ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
- మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450
- మహిళా ఓటర్లు 2,03,85,851... పురుష ఓటర్లు 1,98,31,791
గత ఏడాది జనవరి 6 నుంచి ఈ ఏడాది ఆగస్ట్ 30 వరకు ఓటర్ల జాబితా సంస్కరణను చేపట్టామని చెప్పారు. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునఃపరిశీలన చేశామని... వీటిలో కేవలం 1,533 ఓట్ల తొలగింపులోనే సరైన ప్రక్రియ పాటించినట్టు తేలిందని అన్నారు. జీరో డోర్ నంబర్ తో 2,51,767 ఓట్లు ఉన్నట్టు గుర్తించామని... 1,57,939 ఇళ్లలో 10 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్టు తేలిందని చెప్పారు.