Nannapaneni Rajakumari: ఒక్క అరెస్ట్ తో జగన్ దారుణాలన్నీ పక్కదారి పట్టాయి:నన్నపనేని రాజకుమారి

Nannapaneni Rajakumari fires on Jagan
  • పదవి శాశ్వతం కాదన్న నన్నపనేని
  • చంద్రబాబు జైల్లో ఉండటం దెయ్యాల నిర్ణయమని వ్యాఖ్య
  • మేధావుల మౌనం ప్రమాదకరమన్న నన్నపనేని

  చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో... ముఖ్యమంత్రి జగన్ దారుణాలు అన్నీ పక్కదారి పట్టాయని టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు, జగన్ కోడికత్తి కేసు, వైసీపీ అక్రమాలు అన్నీ పక్కదారి పట్టాయని చెప్పారు. పదవి శాశ్వతం కాదని... పరపతి, ప్రజల హృదయాల్లో స్థానమే శాశ్వతమని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొక్కలు నాటించి చెట్లను పెంచితే... జగన్ పర్యటనలకు వచ్చినప్పుడల్లా చెట్టను కొట్టేస్తున్నారని విమర్శించారు. బాంబ్ బ్లాస్ట్ నుంచి చంద్రబాబు బయట పడటం దైవ నిర్ణయమైతే, జైల్లో ఖైదీగా ఉండటం దెయ్యాల నిర్ణయమని చెప్పారు. అధర్మాన్ని సహిస్తే ధర్మం ప్రమాదంలో పడుతుందని అన్నారు. దుర్మార్గుల దౌర్జన్యం కన్నా, మేధావుల మౌనం ప్రమాదకరమని నెపోలియన్ చెప్పారనే విషయాన్ని ఏపీ ప్రజలకు గుర్తు చేస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News