Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే ఒక్క అభ్యర్థి పేరుతో తెలంగాణ బీజేపీ రెండో జాబితా విడుదల

BJP releases second list with single name
Advertisement
  • ఇటీవల 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
  • నేడు రెండో జాబితా విడుదల
  • మహబూబ్ నగర్ స్థానానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డికి టికెట్
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇటీవల 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేడు రెండో జాబితా విడుదల చేసింది. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరుంది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మిథున్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు. జితేందర్ రెడ్డి 1999లో బీజేపీ ఎంపీగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. 2019లో ఆయన బీజేపీలోకి తిరిగొచ్చారు. ఈసారి తన రాజకీయ వారసుడిగా కుమారుడికి బీజేపీ టికెట్ ఇప్పించుకోవడంలో జితేందర్ రెడ్డి కృషి ఫలించింది.
Advertisement
Advertisement
AP Mithun Reddy
BJP
Second List
Mahaboobnagar
Assembly Election
Telangana

More Telugu News