ఇంగ్లండ్ దుస్థితికి కారణం ఆ ఆలోచనే: వీరేంద్ర సెహ్వాగ్
- శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం
- కనుమరుగవుతున్న ‘సెమీస్’ అవకాశాలు
- ఇంగ్లండ్ పేలవ ప్రదర్శనకు కారణాలు చెప్పిన సెహ్వాగ్
- జట్టులో తరచూ మార్పులు,చేర్పులు దీనికి కారణమని ‘ఎక్స్’ వేదికగా వెల్లడి
మాజీ టీమిండియా క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్, ఈ ప్రశ్నకు చాలా సింపుల్‌గా సమాధానం చెప్పాడు. ‘‘50 ఓవర్ల వన్డే మ్యాచుల్లో ఇంగ్లండ్ గత కొంత కాలంగా ఓ సాధారణ జట్టులా మిగిలిపోతోంది. స్వదేశంలో జరిగిన 2019 వరల్డ్ కప్ మినహా గత 8 పర్యాయాల్లో ఏడు సార్లు వారు సెమీస్‌లో కాలుపెట్టలేదు. స్థిరత్వం లోపించడం, టీంలో తరచూ మార్పులు చేర్పులు చేయడం, టెస్టుల్లో ఉన్నంత సామర్థ్యం వన్డేల్లోనూ ఉందని భ్రమించడంతో వారు చాలా నష్టపోతున్నారు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.