హైదరాబాద్కు అమిత్ షా... రేపు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్రమంత్రి
- ఈ రోజు రాత్రి పదిన్నర గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా
- నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ రోజు రాత్రి బస
- రేపు సాయంత్రం సూర్యాపేట బహిరంగ సభకు అమిత్ షా
మధ్యాహ్నం గం.3కు సూర్యాపేటకు బయలుదేరుతారు. సాయంత్రం గం.4 నుంచి గం.5 వరకు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గం.5.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.