29న చంద్రగ్రహణం.. 28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- తెల్లవారుజామున 1.05-2.22 గంటల మధ్య పాక్షిక గ్రహణం
- 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత
- 8 గంటలపాటు మూతపడనున్న ఆలయం
29న తెల్లవారుజామున 1.05 గంటలకు గ్రహణం మొదలై 2.22 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. 29న తెల్లవారుజామున ఏకాంతంలో ఆలయాన్ని శుద్ధిచేసి ఏకాంతసేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.