Chiranjeevi: ప్రేక్షకుల ముందుకు మళ్లీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’!.. రేపే ట్రయిలర్ రీరిలీజ్

Shankar dada mbbs trailer re release tomorrow
  • రేపు సాయంత్రం 5.40 గంటలకు ట్రయిలర్ రిలిజ్ చేయనున్న మేకర్స్
  • బాస్ కామిక్ టైమింగ్‌కు సిద్ధంగా ఉండాలంటూ సూచన
  • మరోసారి ‘శంకర్ దాదా’ను చూసేందుకు ఉత్సుకతతో చిరు అభిమానులు
‘శంకర్ దాదా ఎంబీబీఎస్ ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2004లో విడుదలైన ఈ మూవీలో చిరు పండించిన హాస్యానికి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అయితే, ఇప్పటితరానికి ఆ హాస్యాన్ని మరోసారి చూపించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. నవంబర్ 4న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రయిలర్‌ను రేపు సాయంత్రం 5.40కు రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. దీంతో, చిరు అభిమానుల్లో ఉత్కంఠ పీక్స్‌కు చేరుకుంది. చిరు హాస్య విశ్వరూపాన్ని మరోసారి పెద్దతెరపై చూసేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. 

ఇప్పటికే స్టార్ హీరోల పాత చిత్రాలు మళ్లీ విడుదలై ప్రేక్షకులను అలరించాయి. డాల్బీ ఆట్మోస్, 4కే వంటి హంగులతో ముస్తాబైన పాత చిత్రాలు సినీ అభిమానులకు పాత జ్ఞాపకాలను కళ్లముందు మెదిలేలా చేశాయి. 
Chiranjeevi
Tollywood

More Telugu News