rajasingh: నా కోసం ప్రచారానికి వస్తున్న యోగి ఆదిత్యనాథ్ ను, నన్ను చంపేస్తామంటూ బెదిరింపులొస్తున్నాయి: ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Rajasingh gets threat calls from unknown people
  • చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న రాజాసింగ్
  • ఫోన్ చేసి నరుకుతాం... చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఎమ్మెల్యే
  • ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్తానన్న రాజాసింగ్   
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్వరలో తన నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం రానున్నారని, ఈ నేపథ్యంలో తామిద్దరిని కలిసి చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. చంపేస్తామంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. ఫోన్ చేసి తనను చంపుతామని, నరుకుతామని బెదిరిస్తున్నారన్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. ఈ విషయాన్ని తాను పోలీసుల దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
rajasingh
BJP
BRS
Telangana Assembly Election

More Telugu News