KTR: నవంబర్ 30 తరువాత కేటీఆర్ ట్విట్టర్‌కే పరిమితం.. తెలంగాణ కాంగ్రెస్ పంచ్!

TCongress lashes out at KTR on social media
  • సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ సెటైర్లు
  • మంత్రిని ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారని విమర్శలు 
  • నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని వ్యాఖ్య
తెలంగాణ కాంగ్రెస్ మరోసారి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించింది. నేరుగా కలిసేందుకు సమయం ఇవ్వరని, నిరసన తెలియజేద్దామంటే హౌస్ అరెస్టులు చేయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల సాయం లేకుండా బయట కాలు కూడా పెట్టలేరని ఎద్దేవా చేసింది. రోజుకు మూడు నాలుగు గంటలు ట్విట్టర్ గూట్లో పిట్ట కూతలు కూసే ట్విట్టర్ టిల్లూను ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తాడని వ్యాఖ్యానించింది. నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని, ఆ తరువాత ఆయన పూర్తి సమయం ట్విట్టర్‌లో గడుపుతూ బాగా ఆస్వాదించవచ్చని ఎద్దేవా చేసింది.
KTR
Congress
Telangana
BRS

More Telugu News