ఎంటీవీని ఊపి పడేసిన హైదరాబాదీ ర్యాపర్.. ఈ వీడియో చూస్తే అభిమానులుగా మారడం పక్కా!
- ఎక్స్‌లో షేర్ చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- ఎంటీవీ హస్టిల్ సీజన్-3లో కేదెన్ శర్మ షో
- ఉర్రూతలూగిపోయన న్యాయనిర్ణేతలు, ఆహూతులు
హైదరాబాద్ కల్చర్‌ను, నగరం గొప్పతనాన్ని ర్యాప్‌లో చెబుతుంటే ఊర్రూతలూగిపోయారు. యువత కేరింతలతో కిర్రెక్కిపోయింది. ‘హలో మేడమ్ ఇదర్ మిల్తా డిస్కౌంట్’ అంటే పడిపడీ నవ్వారు. ‘రియాల్టీ చెక్ మిల్తా హర్ దూస్రీ గల్లీమే’ అంటే ఆశ్చర్యపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎంటీవీలో ప్రసారమైన ఈ షోను చూసి ఎంజాయ్ చేయండంటూ వీడియోను పంచుకున్నారు. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడమే కాదు.. కేదెన్‌శర్మ పాటకు ఫిదా అయిపోతూ అతడికి అభిమానులుగా మారిపోతున్నారు.