ప్రముఖ నటుడి కొడుకును ప్రేమ వివాహం చేసుకుంటున్న అర్జున్ కుమార్తె

Actor Arjun daughter Aishwarya love marriage
  • తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతి ప్రేమలో ఐశ్వర్య
  • ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరు కుటుంబాలు
  • త్వరలో నిశ్చితార్థ వేడుక
స్టార్ హీరో అర్జున్ అనేక భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. సుదీర్ఘ కాలం పాటు హీరోగా నటించిన ఆయన... ఇప్పుడు ప్రాధాన్యత కలిగిన క్యారెక్టర్ పాత్రలను పోషిస్తున్నారు. అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ సరైన హిట్ ను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం తన కుమార్తెను హీరోయిన్ గా నిలబెట్టేందుకు కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ ను హీరోగా పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది. 

మరోవైపు, ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశ్వర్య పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరి ప్రేమ వివాహానికి అర్జున్, తంబి రామయ్య కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఉమాపతి కూడా పలు తమిళ చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని చెపుతున్నారు.

Go Back to Shorts
Arjun
Daughter
Aishwarya
Love Marriage

More Telugu News