ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను... ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari emotional tweet
  • స్కిల్ కేసులో రిమాండులో చంద్రబాబు  
  • అక్టోబరు 25 నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర
  • 'నిజం గెలవాలి' పేరిట రాష్ట్ర వ్యాప్త పర్యటన
  • నిజం గెలుస్తుందని నమ్ముతున్నానని భావోద్వేగభరిత ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి రేపటి నుంచి 'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. 

"నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను, ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను" అని వెల్లడించారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Nijam Gelavali
Bus Tour
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News