Congress: కాంగ్రెస్ టిక్కెట్ కేటాయింపులు.. తెలంగాణ నేతలకు ఢిల్లీ నేత కీలక సూచన

Delhi congress leader suggetion to telangana T leaders
  • పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై సంప్రదింపులు కొనసాగుతాయన్న ఏఐసీసీ కార్యదర్శి అలీఖాన్
  • టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం ముగియలేదన్న అలీఖాన్
  • పార్టీకి లేదా నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్లకు సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ తెలంగాణ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. మిగతా పార్టీ టిక్కెట్ల కేటాయింపులపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని, టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం ఇంకా ముగియలేదన్నారు. టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి నాయకులు ఎవరూ కూడా పార్టీకి కానీ, నాయకులకు కానీ వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడవద్దని సూచించారు.

అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల విషయంలో ఏమైనా విభేదాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని సూచించారు. కానీ పత్రికా సమావేశాలు, ప్రకటనలు ఇస్తూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దన్నారు. టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి కొంతమంది నాయకులు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, అలా చేయడం సరికాదన్నారు. ఏ నాయకులు కూడా టిక్కెట్ కేటాయింపు విషయంలో బహిరంగంగా మాట్లాడవద్దని, వారికి ఏ సమస్య ఉన్నా అధిష్ఠానం దృష్టికి తీసుకు రావాలన్నారు.
Congress
Telangana Assembly Election

More Telugu News