Pawan Kalyan: ఏపీ పరిణామాలపై చిత్ర పరిశ్రమ ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే...!

Pawan Kalyan explanation on cine industry being mum on recent political developments in AP
  • ఇటీవల ఏపీలో చంద్రబాబు అరెస్ట్... రిమాండ్
  • చిత్ర పరిశ్రమ వ్యక్తులు స్పందించకపోవడంపై విమర్శలు
  • హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్
  • సినిమా వాళ్లు కళాకారులే తప్ప రాజకీయ నాయకులు కారని వెల్లడి 
హైదరాబాదులో ఇవాళ నిర్వహించిన 'మహా మ్యాక్స్' న్యూస్ చానల్ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తదితర పరిణామాలపై చిత్ర పరిశ్రమ స్పందించకపోవడం పట్ల విమర్శలు వస్తుండడంపై ఆయన స్పందించారు. 

ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి సినీ ఇండస్ట్రీ స్పందించాలని కోరుకోవడం సబబు కాదని, అదేమంత తేలికైన విషయం కాదని అన్నారు. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు కళాకారులే తప్ప రాజకీయ నాయకులు కారన్న విషయాన్ని గుర్తించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

రజనీకాంత్ వంటి వాళ్లు కూడా రాజకీయాలపై మాట్లాడలేరని, ఒకవేళ ఏదైనా మాట్లాడితే ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో తెలిసిందేనని అన్నారు. అందుకే చిత్ర పరిశ్రమ ఇటీవల రాజకీయ పరిణామాలపై స్పందించలేదని భావిస్తున్నానని తెలిపారు. 

జీవితంలో వినోదం అనేది అత్యంత ముఖ్యమైనదని, ఆ వినోదంలో సినిమాది అగ్రస్థానం అని పవన్ కల్యాణ్ వివరించారు.
Pawan Kalyan
Tollywood
AP Politics
Chandrababu
Arrest
Janasena
TDP
YSRCP

More Telugu News