Israel: హమాస్ ను ఏరిపారేసేదాకా దాడులు ఆగవు: ఇజ్రాయెల్

Israel promises unrelenting attacks on Hamas says want to bring it to full
షార్ట్స్‌లో చూడండి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. హమాస్ ను నిర్వీర్యం చేసేందుకు నిరంతరాయ దాడులకు తాము సన్నద్ధం అయినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (సాయుధ దళాల చీఫ్) లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఓ ప్రకటన విడుదల చేశారు. దాడులు ఆపే ఉద్దేశ్యం ఏదీ లేదని స్పష్టం చేశారు. హమాస్ ను పూర్తిగా కూల్చివేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అదే పనిగా దాడులకు దిగడమే హమాస్ మార్గం. హమాస్ ఎక్కడున్నా సరే దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించారు. 

యుద్ధం హైలైట్స్
  • తమ చెరలో ఉన్న ఇద్దరు ఇజ్రాయెలీలను హమాస్ మిలిటెంట్లు మానవతా కోణంలో తాజాగా విడుదల చేశారు. వారి చెరలో మొత్తం 200 మంది ఇజ్రాయెల్ వాసులు ఉణ్నారు. 
  • 17 రోజుల యుద్ధంలో మృతుల సంఖ్య 6,400 దాటింది. 
  • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నెలవారీ సమావేశం నేడు జరగనుంది. ఇజ్రాయెల్-పాలస్థీనా పరిస్థితులపై దీనిలో దృష్టి సారించనున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని, పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ అమెరికా తీర్మానం ప్రవేశపెట్టనుంది. 
  • ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ మంగళవారం ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. 
  • అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చిన్న ప్రకటన విడుదల చేశారు. హమాస్ పై ప్రతీకార చర్యల్లో భాగంగా ఎక్కువ మంది పౌరులకు నష్టం తలెత్తకుండా చూడాలని కోరారు.
Go Back to Shorts
Israel
unrelenting attacks
attacks
Hamas

More Telugu News