నేపాల్‌ను భయపెడుతున్న వరుస భూకంపాలు.. మళ్లీ మరోటి!
- ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం
- తాజాగా ఈ తెల్లవారుజామున 4.1 తీవ్రతతో మరోటి
- ఖాట్మండుకు 393 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
- అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో 11వ స్థానంలో నేపాల్
టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణంగా మారాయి. శతాబ్దానికి ఒకసారి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండుమీటర్ల మేర దగ్గరకు జరుగుతుండడంతో ఒత్తిడి ఏర్పడి భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను ప్రళయాన్నే సృష్టించింది. ఆ భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మిలియన్ నిర్మాణాలు కుప్పకూలాయి. అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో ప్రపంచంలో నేపాల్‌ది 11వ స్థానం.