పవన్ కల్యాణ్ ఇష్యూ... తన పేరు లాగిన నెటిజన్‌కు అనసూయ కౌంటర్

ఓ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూసేందుకు, ఫొటోలు దిగేందుకు చాలామంది రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనను ఉద్దేశించి ఓ నెటిజన్... అనసూయ, రష్మి వచ్చినా జనం ఇలాగే ఎగబడతారని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌పై అనసూయ తీవ్రంగా స్పందించారు. ఇలా చులకనగా మాట్లాడటం సరికాదని సదరు నెటిజన్‌పై అసహనం వ్యక్తం చేశారు. 

తాను ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చానని, తన ఈ ప్రయాణాన్ని తక్కువగా చేసి చూడవద్దని, గౌరవించాలన్నారు. అగౌరవంగా తమ పేరును లాగడం తప్పన్నారు. మీరు చెప్పినట్లు మమ్మల్ని చూసేందుకు జనం ఎగబడతారని, ఎందుకంటే జీవితంలో ఏదో సాధించిన వాళ్లు ఎలా ఉంటారో చూద్దామని వారు వస్తారన్నారు. మీరు మా పేర్లు వాడినంత సులువుగా ఈ స్థాయికి రాలేరని చురకలు అంటించారు. మా ప్రయాణాన్ని గౌరవించాలన్నారు.

ఏం జరిగింది?

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పోరంకిలో జరిగింది. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయనను కలిసేందుకు, జనసేనానితో ఫొటోలు దిగేందుకు చాలామంది ఆసక్తి చూపారు. దీంతో తోపులాట జరిగింది. వ్యక్తిగత సిబ్బంది అక్కడ ఉన్న వారిని పక్కకు తప్పించి పవన్ కల్యాణ్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు చిక్కుకుపోయారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ... అయితే ఏంది.. ఎమ్మెల్యేగా (పవన్ కల్యాణ్) గెలిచేస్తాడా? అనసూయ, రష్మి వచ్చినా జనాలు ఇలాగే ఎగబడతారని కామెంట్ చేశారు.


More Telugu News