డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు... మహువా మోయిత్రాపై ఆరోపణల మీద తృణమూల్ మౌనం
- పార్లమెంటులో మోదీకి, అదానీకి వ్యతిరేకంగా మహువా ప్రశ్నలు
- దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు వచ్చినట్లు బీజేపీ ఎంపీ ఆరోపణలు
- ఈ వ్యవహారం పట్టనట్లుగా తృణమూల్ కాంగ్రెస్
ఈ వ్యవహారంపై తృణమూల్ మౌనం వహించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిదని ఆ పార్టీ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే స్పందిస్తే బాగుంటుందని ఆ పార్టీ భావిస్తోందట. పార్టీ అధినాయకత్వం ఈ వ్యవహారంలో తలదూర్చేందుకు ఇష్టపడటం లేదంటున్నారు. అయితే తమ పార్టీ నేతలపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా తృణమూల్ ఇలాగే వ్యవహరిస్తోందని అంటున్నారు.