Koko: ఢిల్లీ గల్లీలో రష్యన్ యూట్యూబర్ వెంటపడిన ఆకతాయి!

  • కోకో ఇన్ ఇండియా పేరిట యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న రష్యన్ యువతి
  • ఇటీవల ఢిల్లీలో పర్యటన
  • సరోజినీ నగర్ మార్కెట్ వద్ద విసిగించిన ఆకతాయి
Russian Youtuber Koko faces trouble from youth in Delhi

రష్యాకు చెందిన కోకో అనే యువతి 'కోకో ఇన్ ఇండియా' పేరిట ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది. భారత్ లోని వివిధ దర్శనీయ స్థలాలకు వెళుతూ, తన అనుభవాలను వీడియోల రూపంలో పంచుకుంటుంది. ఆమె యూట్యూబ్ చానల్ కు 2.05 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 

అయితే, ఇటీవల ఆమె ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా ఓ ఆకతాయి ఆమె వెంటపడ్డాడు. నువ్వు బాగున్నావు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? అంటూ ఓ కుర్రాడు సరోజినీ నగర్ మార్కెట్ వద్ద ఆమెను సతాయించాడు. అప్పటికీ, కోకో ఎంతో సంయమనంతో మాట్లాడి, అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. చివరికి "ధన్యవాదాలు" అంటూ అతడి నుంచి దూరంగా వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 

సదరు ఆకతాయి ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి వైఖరి పట్ల భారతీయులుగా తాము క్షమాపణలు చెబుతున్నామంటూ రష్యన్ యువతి కోకోకు సంఘీభావం తెలిపారు.

More Telugu News