పాలస్తీనాకు హైదరాబాద్‌లోని దర్గాలో మహిళల సంఘీభావం!
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
- పాలస్తీనాకు అనుకూలంగా సైదాబాద్ దర్గాలో కలిసిన మహిళలు
- దర్గా ద్వారం వద్ద ఇజ్రాయెల్, అమెరికా జెండాలు
ఇందుకు సంబంధించి ఏఎన్ఐ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో దర్గా ప్రవేశద్వారం వద్ద నేలపై ఇజ్రాయెల్, అమెరికా జెండాలు కనిపించాయి. మహిళలు ఆ జెండాల మీదుగా నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం నేపథ్యంలో పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు సైదాబాద్ ప్రాంతంలో మహిళలు దర్గా వద్ద సమావేశమయ్యారని ఏఎన్ఐ పేర్కొంది.