వారు నాపై విమర్శలు చేస్తుంటే సంతోషంగా ఉంది!: రాహుల్ గాంధీ
- మంథనిలో బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ
- బీజేపీకి మజ్లిస్, బీఆర్ఎస్ మద్దతుగా ఉన్నాయని ఆరోపణ
- కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నందువల్లే సీబీఐ, ఈడీ ఆయన వెంట పడవని వ్యాఖ్య
బీజేపీతో పోరాడుతున్నానని నిరంతరం తన డీఎన్ఏ గుర్తు చేస్తోందని, బీజేపీకి మద్దతిచ్చేవారు తనపై విమర్శలు చేస్తోంటే తన పోరాటం సవ్యంగా సాగుతోందని అర్థమవుతోందన్నారు. అది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. కులగణన ఎక్స్‌రే వంటిదన్నారు. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్స్‌రే అంటే కులగణన చేయిస్తామన్నారు.