టీడీపీ అధినేత చంద్రబాబు తాజా ఆరోగ్య బులెటిన్ విడుదల

Chandrababu health bulletin releasd
టీడీపీ అధినేత చంద్రబాబు తాజా ఆరోగ్య బులెటిన్ ను రాజమండ్రి జైలు అధికారులు కొద్దిసేపటి కింద విడుదల చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చంద్రబాబును పరిశీలించి ఇచ్చిన వివరాల మేరకు ఈ బులెటిన్ రూపొందించారు. ఈ బులెటిన్ లో చంద్రబాబు ఖైదీ నెంబరుతో పాటు, ఆయనను రిమాండ్ ముద్దాయిగా పేర్కొన్నారు. 

ఇక, బీపీ-130/80, శరీర ఉష్ణోగ్రత-నార్మల్, నాడి-64/మినిట్, శ్వాస-12/మినిట్, హార్ట్ రేట్-ఎస్1 , ఎస్2 , ఆక్సిజన్ శాచ్యురేషన్-గది వాతావరణం వద్ద 96 శాతం, ఊపిరితిత్తులు-క్లియర్, శారీరక క్రియాశీలత-బాగుంది, బరువు-67 కేజీలు అని వివరించారు. 

పై అంశాల ఆధారంగా చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని బులెటిన్ లో స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu
Health Bulletin
Jail
Rajahmundry
TDP
Andhra Pradesh

More Telugu News