పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' టీజర్ విడుదల
- వెంకటేశ్ ప్రధాన పాత్రలో సైంధవ్
- శైలేష్ కొలను దర్శకత్వం
- పూర్తి స్థాయి యాక్షన్ సన్నివేశాలతో టీజర్
- వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకి సైంధవ్
"వెళ్లే ముందు చెప్పి వెళ్లా... విన్లేదు... అంటే... భయం లేదు. లెక్క మారుద్దిరా నా కొ**ల్లారా" అంటూ వెంకీ పవర్ ఫుల్ డైలాగు చెప్పడం టీజర్ లో చూడొచ్చు.
ఈ చిత్రంలో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ, ఆర్య, శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, జిషు సేన్ గుప్తా, ముఖేశ్ రిషి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న 'సైంధవ్' చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.