AP High Court: అమరావతి అసైన్డ్ భూముల విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. కేసును రీఓపెన్ చేయాలని సీఐడీ మరో పిటిషన్

AP High Court adjourned hearing of Amaravati assigned lands case
  • హైకోర్టులో ఇప్పటికే పూర్తయిన విచారణ
  • ఈరోజు వెలువడాల్సిన తీర్పు
  • కోర్టుకు కొత్త ఆధారాలను సమర్పించిన సీఐడీ
అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణను ఏపీ హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. ఈరోజు తీర్పును వెలువరిస్తామని హైకోర్టు గత విచారణ సమయంలో తెలిపింది. అయితే ఈ కేసులో కొత్త ఆధారాలు ఉన్నాయని, వాటిని పరిగణనలోని తీసుకుని విచారించాలని సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. కేసును రీఓపెన్ చేయాలని పిటిషన్ వేసింది. కొత్త ఆధారాలను (ఆడియో ఫైల్స్) పరిశీలించిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. కేసు రీఓపెన్ పై అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని సూచించింది.

AP High Court
Amaravati
Assigned Lands
CID

More Telugu News