Hamas: తన చావును తనే రికార్డు చేసుకున్న మిలిటెంట్.. ఇజ్రాయెల్ సిటీలో ఘటన.. వీడియో ఇదిగో!

Hamas terrorist recording attack on Israelis captures his own death
  • కిబ్బుట్జ్ సూఫాలో హమాస్ మిలిటెంట్ల ఆకృత్యాలు
  • పౌరులపై కాల్పులు జరుపుతూ వీడియో తీసిన మిలిటెంట్లు
  • కాల్పులు జరిపి మిలిటెంట్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ బలగాలు
ఇజ్రాయెల్ పై మెరుపుదాడికి దిగిన హమాస్ మిలిటెంట్లు ప్రపంచానికి చూపేందుకు తమ ఆకృత్యాలను వీడియో తీశారు. ఈ నెల 7న ఇజ్రాయెల్ లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ వెళ్లారు. ఓవైపు కాల్పులు జరుపుతూనే ఓ మిలిటెంట్ ఫోన్ కెమెరాలో రికార్డు చేస్తున్నాడు. ముందు ఒక మిలిటెంట్ వెలుతుండగా వెనకాల అనుసరిస్తూ వెళుతూ వీడియో తీస్తున్నాడు. ఇళ్లల్లో దాక్కున్న వారిని హమాస్ మిలిటెంట్లు వెతికి మరీ కాల్పులు జరుపుతూ వెళుతున్నారు. ఇంతలో ఇజ్రాయెల్ బలగాలు వీరిని గమనించి కాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో ముందు నడుస్తున్న మిలిటెంట్ కుప్పకూలడం, ఏం జరిగిందో తెలిసేలోగా వీడియో తీస్తున్న మిలిటెంట్ శరీరంలోకి బుల్లెట్లు దిగడం కనిపించింది. దీంతో రెండో మిలిటెంట్ కూడా కుప్పకూలి చనిపోయాడు. తమ ఆకృత్యాలను రికార్డు చేసి రాక్షసానందం పొందాలని చూసిన మిలిటెంట్.. చివరికి తన చావును తనే రికార్డు చేసుకున్నాడు. సదరన్ ఇజ్రాయెల్ లోని కిబ్బుట్జ్ సూఫా సిటీలో చోటుచేసుకుందీ ఘటన.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hamas
recording attack
captures own death
Israel
Viral Videos

More Telugu News