woman cop: స్టేడియంలో గొడవ.. మహిళా పోలీసుపై దాడి చేయబోయిన అభిమాని

Video Man tries to slap woman cop in stadium during Ind vs Pak match
  • భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన
  • నరేంద్ర మోదీ స్టేడియంలో యువకుడి చెంప పగులగొట్టిన మహిళా పోలీస్
  • ఈ చర్యను తప్పుబడుతున్న నెటిజన్లు
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మహిళా పోలీసుకు, ప్రేక్షకుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన సీటులో కూర్చుని మ్యాచ్ ను వీక్షిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన మహిళా పోలీస్ ఒకరు అతడితో వాదనకు దిగడం కనిపించింది. దీనికి కారణం తెలియరాలేదు. 

యువకుడి మాటలతో ఆగ్రహించిన పోలీసు అతడి చెంప చెళ్లు మనిపించింది. దీంతో ఆ యువకుడు సైతం చేత్తో ఆమెపై దాడి చేయబోయాడు. దీంతో ఆమె అతడిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. చుట్టుపక్కల  కూర్చున్న వారు  ఆ యువకుడిని నియంత్రించబోయారు. ఏదో విషయమై యువకుడిని మహిళా పోలీస్ దూషించడం సమస్యకు దారితీసినట్టు తెలుస్తోంది. అయితే, మహిళా పోలీస్ అతడిపై చేయి చేసుకుని ఉండాల్సింది కాదన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
woman cop
slap
youth
India vs Pakistan match

More Telugu News