మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత
- గుండెపోటుతో కన్నుమూసిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సత్యవతి
- ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూత
- 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యవతి
సీపీఎం పార్టీ ద్వారా కుంజా సత్యవతి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1991లో ఆ పార్టీ ద్వారా ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ చొరవతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ చనిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ సొంత గూటికే చేరినప్పటికీ... రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ఆమె భౌతిక కాయానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నివాళి అర్పించారు.