Starbucks: ఉద్యోగం నుంచి తీసేశారని ప్రతీకారం.. నెట్టింట స్టార్‌బక్స్ సీక్రెట్స్ లీక్!

Viral Post Claims To Show Secret Recipes Of Drinks Leaked By Ex Employee
  • స్టార్‌బక్స్ కాఫీ, ఇతర పానీయాల సీక్రెట్ రెసిపీలు నెట్టింట వైరల్
  • సంస్థపై ప్రతీకారంగా రెసిపీలను బయటపెట్టిన మాజీ ఉద్యోగి
  • సంబరాలు చేసుకుంటున్న స్టార్‌బక్స్ అభిమానులు
  • ఇకపై ఇంట్లోనే తమకు నచ్చిన స్టార్‌బక్స్ పానీయాలు చేసుకుంటామని వెల్లడి
స్టార్‌బక్స్.. ఈ బ్రాండ్‌ గురించి తెలియని వారు బహుశా ఉండరేమో! కాఫీలు, ఇతర పానీయాలకు ఈ కేఫ్ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. అక్కడి రుచి మరే చోటా లభించదని కాఫీప్రియులు చెబుతుంటారు. ఇక స్టార్‌బక్స్‌ తన పానీయాల రెసిపీలను జాగ్రత్తగా రక్షించుకుంటుంది. వీటిని బయట పెట్టకూడదంటూ ఉద్యోగులపై కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. కానీ, తనను ఉద్యోగం నుంచి తీసేసినందుకు స్టార్‌‌బక్స్‌పై ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏ పానీయాన్ని ఎలా తయారు చేయాలో చెప్పే రకరకాల రెసిపీలను మొత్తం నెట్టింట షేర్ చేశాడు. 

ఇది చూసి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఈ లీకైన రెసిపీల ఆధారంగా ఇంట్లోనే స్టార్‌బక్స్ స్థాయి కాఫీలు గట్రా తయారు చేసుకోవచ్చని సంబరపడ్డారు. మరికొంతమందేమో వీటి ఆధారంగా వ్యాపారం కూడా ప్రారంభిస్తే బాగుటుందని అభిప్రాయపడ్డారు. ఈ చర్య తరువాత స్టార్‌బక్స్‌లో నిబంధనలు మరింత కఠినతరం అవుతాయని, కొత్త ఉద్యోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయని కొందరు హెచ్చరించారు. ఈ రెసిపీల ఫొటోలను నెట్టింట షేర్ చేయడం కూడా ప్రమాదమేనని కొందరు వార్నింగ్ ఇచ్చారు.  అయితే, గతంలోనూ కొందరు స్టార్‌బక్స్ మాజీ ఉద్యోగులు ఇలాంటి చర్యలకు పూనుకున్నారు. ఉద్యోగాన్ని వీడాక పలు రెసిపీలను నెట్టింట పంచుకున్నారు.
Starbucks
Recipe Leak
Viral Pics

More Telugu News