గాజాను ఆక్రమించొద్దు.. ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్
- గాజాను మళ్లీ ఆక్రమించుకుంటే అది పెద్ద తప్పే అవుతుందన్న బైడెన్
- గాజాలోని పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ ప్రాతినిధ్యం వహించబోదన్న అమెరికా అధ్యక్షుడు
- ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా వెళ్లబోదని ఆశాభావం
‘‘అది చాలా పెద్ద తప్పే అవుతుంది’’ అని బైడెన్ చెప్పుకొచ్చారు. గాజాలో ఏం జరుగుతోందో తన కోణంలో చెప్పాలంటే.. అక్కడి పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రాతినిధ్యం వహించబోదని తేల్చి చెప్పారు. కాబట్టి గాజాను కనుక ఇజ్రాయెల్ మళ్లీ ఆక్రమించుకుంటే అదిపెద్ద తప్పే అవుతుందని చెప్పారు. అయితే, అక్కడున్న ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందేనని బైడెన్ వివరించారు. ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లదన్న విశ్వాసం తనకు ఉందని బైడెన్ పేర్కొన్నారు.