చేతులను తాళ్లతో కట్టేసుకుని నారా భువనేశ్వరి నిరసన

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నెల రోజులకు పైగా రాజమండ్రిలో జైలులో రిమాండ్
  • 'న్యాయానికి సంకెళ్లు' నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ
  • నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమం అని నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7.05 గంటల వరకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లోని క్యాంప్ సైట్ వద్ద నారా భువనేశ్వరి మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. భువనేశ్వరి తన చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధర్మం నశించాలి, అన్యాయం నశించాలి అని నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి తదితర నేతలు పాల్గొన్నారు.

Nara Bhuvaneswari
Chandrababu
Arrest
Nyayaniki Sankellu

More Telugu News