కాలకృత్యాలు తీర్చుకోడానికి 25 లక్షల కమోడ్ అవసరమా జగన్: టీడీపీ ఎద్దేవా

  • జగన్ నివాసంలో రూ. 25 లక్షల కమోడ్ అంటూ టీడీపీ విమర్శలు
  • ప్రజా ధనంతో నీ కొంపకు సోకులేంటని మండిపాటు
  • సొమ్ము తినమరిగిన నీకు సిగ్గా ఎగ్గా? అంటూ తీవ్ర వ్యాఖ్య
ప్రజాధనంతో ముఖ్యమంత్రి జగన్ లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. రూ. 25 లక్షల విలువైన కమోడ్ ను వాడుతున్నారని దుయ్యబట్టింది. లక్షాధికారైన లవణ మన్నమే కానీ... మెరుగు బంగారంబు మింగబోడు అని శేషప్ప కవి తన నరసింహ శతకంలో అన్నాడని తెలిపింది. అలాంటప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి రూ. 25 లక్షల కమోడ్ అవసరమా జగన్ రెడ్డీ? అని ఎద్దేవా చేసింది. సొమ్ము తినమరిగిన నీకు సిగ్గా ఎగ్గా? అని వ్యాఖ్యానించింది. ప్రజా ధనంతో నీ కొంపకు సోకులేంటని మండిపడింది. ప్రజల సొమ్ము కమోడ్ పాలు అని విమర్శించింది.

Jagan
YSRCP
Rs 25 laksh
Commode
Telugudesam

More Telugu News