శిల్పాశెట్టితో కలిసి స్టెప్పులు వేసిన రవితేజ.. వీడియో వైరల్

Ravi Teja dances with Shilpa Shetty
  • అక్టోబర్ 20న విడుదలవుతున్న రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'
  • పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న చిత్రం
  • బాలీవుడ్ లో ప్రమోషన్స్ లో బిజీగా రవితేజ
మాస్ మహారాజ రవితేజ ఈ దసరాకి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అక్టోబర్ 20 ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం రవితేజ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రవితేజ ప్రమోట్ చేస్తున్నాడు. బాలీవుడ్ ప్రమోషన్స్ లో కూడా రవితేజ అదరగొడుతున్నాడు. ప్రెస్ మీట్లు, టీవీ షోలలో పాల్గొంటున్నాడు. ఇండియా గాట్ ట్యాలెంట్ అనే షోలో చిత్ర యూనిట్ తో కలిసి రవితేజ పాల్గొన్నాడు. ఈ షోలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో కలిసి స్టెప్పులు వేశాడు. ఈ డ్యాన్స్ ను శిల్పాశెట్టి ట్విట్టర్ లో షేర్ చేసింది. దీన్ని షేర్ చేసిన రవితేజ... మిమ్మల్ని కలవడం, మీతో డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు. 

Go Back to Shorts
Raviteja
Shilpa Shetty
Dance
Tollywood
Bollywood

More Telugu News