కాసేపట్లో ఢిల్లీ నుంచి విజయవాడకు లోకేశ్... రేపు సీఐడీ విచారణకు హాజరు!

Nara Lokesh to reach vijayawada tonight
  • ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన నారా లోకేశ్
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు సీఐడీ ఎదుట హాజరు కోసం రాక
  • హైకోర్టు ఆదేశాలతో సీఐడీ ఎదుట హాజరవుతున్న లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్‌కు గతంలోనే నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయన ఈ రోజు విజయవాడకు చేరుకోనున్నారు. రేపు (అక్టోబరు 10) ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయంలో సీఐడీ విచారణకు ఆయన హాజరవుతారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని తొలుత సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై లోకేశ్ న్యాయస్థానానికి వెళ్లారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ తేదీని 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, రేపు ఆయన సీఐడీ విచారణకు హాజరవుతున్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Vijayawada
cid
Telugudesam

More Telugu News