కాసేపట్లో ఢిల్లీ నుంచి విజయవాడకు లోకేశ్... రేపు సీఐడీ విచారణకు హాజరు!
- ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన నారా లోకేశ్
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు సీఐడీ ఎదుట హాజరు కోసం రాక
- హైకోర్టు ఆదేశాలతో సీఐడీ ఎదుట హాజరవుతున్న లోకేశ్
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని తొలుత సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై లోకేశ్ న్యాయస్థానానికి వెళ్లారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ తేదీని 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, రేపు ఆయన సీఐడీ విచారణకు హాజరవుతున్నారు.