శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై తీర్పు వాయిదా
- 2018 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహబూబ్ నగర్ వాసి
- ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని వాదనలు
దీనిపై మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ను మళ్లీ వెనక్కి తీసుకుని, సవరణలు చేయడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో మంగళవారం తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.