Gandhi Hospital: పేదలకు అందుబాటులోకి అత్యంత ఖరీదైన ఐవీఎఫ్ చికిత్స.. గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి.. ఫొటోలు ఇవిగో!

  • రూ. 5 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • నేడు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్
  • ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారంటూ కేసీఆర్‌కు హరీశ్ థ్యాంక్స్
IVF Center In Gandhi Hospital

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం రూ. 5 కోట్లతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దవాఖానలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నేడు మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. మంత్రి హరీశ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. 

 అత్యంత ఖరీదైన ఐవీఎఫ్ చికిత్సను ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.  ఆరోగ్య తెలంగాణ సాధించిన ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ అమలు చేస్తే దేశం ఆచరిస్తుందని పేర్కొన్నారు.
  ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఐవీఎఫ్ కేంద్రం సంతానం లేని దంపతులకు వరం కానుంది. 2018 నుంచే గాంధీ ఆసుపత్రిలో ఇంట్రాటెరైన్ ఇన్‌సెమినేషన్ (ఐయూవీ) విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు 200 మందికి సంతాన భాగ్యం కలిగిందని పేర్కొన్నారు. 

More Telugu News