దసరా సెలవు తేదీలో మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Dasara holiday changed in telangana government
  • తొలుత అక్టోబర్ 24వ తేదీని దసరా సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం
  • 23న దసరా పండుగ నిర్వహించుకోవాలన్న తెలంగాణ విద్వత్ సభ
  • 23తో పాటు మొదట ప్రకటించిన 24వ తేదీని సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం
దసరా పండుగ సెలవులో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, 24వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటించింది. దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును ఒకరోజు ముందుకు మార్చింది. అలాగే ఇంతకుముందు ప్రకటించిన సెలవునూ కొనసాగించింది.
Go Back to Shorts
Telangana
dasara
festival

More Telugu News