ఆ కంటెంట్ తొలగించాలంటూ.. ఎక్స్, టెలిగ్రామ్, యూట్యూబ్‌లకు కేంద్రం హెచ్చరిక
- చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశాలు
- తొలగించకుంటే సేఫ్ హార్బర్ హోదాను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరిక
- అలాంటి కంటెంట్ యాక్సెస్ చేయకుండా లేదా శాశ్వతంగా తొలగించాలని సూచన
అలాంటి కంటెంట్‌కు యాక్సెస్ లేకుండా చేయడం లేదా శాశ్వతంగా తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. భవిష్యత్తులోనూ ఇలాంటి కంటెంట్‌ను నిరోధించేందుకు పర్యవేక్షణ, నియంత్రణ, రిపోర్టింగ్ అల్గారిథంలలో మార్పులు చేసుకోవాలని సూచించింది. చర్యలు తీసుకోకుంటే మాత్రం ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కల్పిస్తోన్న సేఫ్ హార్బర్ హోదాను ఉపసంహరించుకుంటామని కేంద్రం తెలిపింది.