టీడీపీ పల్లకీ మోయడానికి పవన్ సిద్ధమయ్యాడు: అంబటి రాంబాబు విసుర్లు
- టీడీపీ బలహీనపడిందని పవన్ చెబుతుంటే, తమకు సింపతీ పెరిగిందని టీడీపీ చెబుతోందని ఎద్దేవా
- ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా జగన్‌కు ఏమీ కాదన్న మంత్రి
- టీడీపీ మునిగిపోయే నావ, ఎవరు లేపినా లేచే పరిస్థితి లేదని వ్యాఖ్య
తప్పు చేసి జైలుకెళ్లిన ముఖ్యమంత్రులు ఎవరూ రాజకీయంగా బతికిబట్టకట్టలేదని, అధికారంలోకి రాలేదన్నారు. అలా జైలుకు వెళ్లిన మాజీ సీఎంల విషయానికి వస్తే జయలలిత పరిస్థితిని చూశామన్నారు. టీడీపీ మునిగిపోయే నావ అని, మళ్లీ ఎవరు లేపినా లేచే పరిస్థితి లేదన్నారు. అలాంటి టీడీపీకి, చంద్రబాబుకు జనసేన అధినేత మద్దతిస్తున్నారని విమర్శించారు.