Kodali Nani: చంద్రబాబు, పవన్ లపై మరోసారి కొడాలి నాని విమర్శలు

  • వైసీపీని రూపాయి పావలా అన్న పవన్ కల్యాణ్
  • అంటే వైసీపీకి 125 వస్తాయని పవన్ చెప్పారన్న కొడాలి నాని
  • చంద్రబాబు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా
Kodali Nani comments on Chandrababu and Pawan Kalyan

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లారని ఆయన అన్నారు. చంద్రబాబు కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. వైసీపీని రూపాయి పావలా అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... వైసీపీకి 125 వస్తాయని పవన్ చెప్పారని అన్నారు. పావలా కల్యాణ్ కు 25, రూపాయి పావలా అన్న వైసీపీకి 125 వస్తాయని చెప్పారు. వపన్ మనసులో మాట ఇదే అనుకుంటానని ఎద్దేవా చేశారు. కరిచే కుక్క మొరగదని, మొరిగే కుక్క కరవదని అన్నారు. 

More Telugu News