వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో?: సజ్జల రామకృష్ణారెడ్డి

  • టీడీపీ బలహీనపడిందని పవన్ కల్యాణ్ చెప్పారన్న సజ్జల
  • ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారని వ్యాఖ్య
  • పెడనలో పవన్ కల్యాణ్ తీరు ఆశ్చర్యం కలిగించిందన్న సజ్జల
పెడన జనసేన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని పవన్ చెప్పారన్నారు. ఎన్డీయే కూటమి నుంచి తాను బయటకు వచ్చినట్లు కూడా చెప్పారన్నారు. నిన్నటి బహిరంగ సభలో పవన్ మూడు అంశాలపై మాట్లాడారన్నారు.

టీడీపీ బలహీనపడిందని, ఆ పార్టీకి యువరక్తం ఎక్కిస్తానని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చానని చెప్పారన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో పవన్ కల్యాణ్ చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బలహీనపడిన టీడీపీ కూడా ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తేలాలని వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy
YSRCP
Andhra Pradesh
Pawan Kalyan
Janasena

More Telugu News