Election Commission: మాదాపూర్‌లో ఈసీ సమావేశం.. నగరవాసులకు ట్రాఫిక్ అలర్ట్

Hyderabad Traffic advisory issued for Thursday in view of ECI meeting in madhapur
  • మాదాపూర్ టెక్ మహీంద్రా వేదికగా గురువారం ఎన్నికల కమిషన్ సమావేశం
  • పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్, ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
  • ఇందుకు అనుగుణంగా అక్కడి కార్యాలయాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచన
మాదాపూర్‌లో నేడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమావేశం జరగనుండటంతో ట్రాఫిక్ పోలీసులు నగర వాసులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ఈ సమావేశానికి హాజరుకానుండటంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. సమావేశం జరుగుతున్న టెక్ మహీంద్రా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయని తెలిపారు. లెమన్ ట్రీ హోటల్ నుంచి సీఐఐ వరకూ, కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోటరీ వరకూ, రోటరీ-సైబర్ టవర్స్ మధ్య, కొత్తగూడ నుంచి హైటెక్స్ వరకూ ఉన్న ప్రైవేటు సంస్థలు ఇందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. 

లెమన్ ట్రీ జంక్షన్-ఫీనిక్స్, ఎరీనా రోడ్-టెక్ మహీంద్రా రోడ్-సీఐఐ జంక్షన్‌లో భారీ ట్రాఫిక్‌ ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు నగరవాసులను హెచ్చరించారు. దీంతో పాటూ ఐకియా రోటరీ-లెమన్ ట్రీ జంక్షన్- సైబర్ టవర్ జంక్షన్‌, కేబుల్ బ్రిడ్జి జంక్షన్-సీగేట్ జంక్షన్-ఐకియా రోటరీ, కొత్తగూడ జంక్షన్ నుంచి సైబర్ టవర్ జంక్షన్ వరకూ భారీ ట్రాఫిక్‌ ఉంటుందని పేర్కొన్నారు.
Election Commission
Hyderabad
Traffic Advisory

More Telugu News