YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 16వ తేదీకి వాయిదా

  • సీబీఐ కోర్టుకు హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి
  • గంగిరెడ్డి, సునీల్ తదితరులను కోర్టుకు తీసుకు వచ్చిన పోలీసులు
  • వైఎస్ భాస్కరరెడ్డి ఎస్కార్ట్ బెయిల్ అక్టోబర్ 10 వరకు పొడిగింపు
YS Viveka murder case hearing postponed

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మళ్లీ వాయిదాపడింది. కేసు విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్‌లను పోలీసులు కోర్టుకు తీసుకు వచ్చారు. అలాగే, ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌ను సీబీఐ కోర్టు అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించింది. భాస్కరరెడ్డి బెయిల్ నిన్నటితో ముగిసింది. అయితే ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయస్థానం ఎస్కార్ట్ బెయిల్‌ను మరో వారం పొడిగించింది.

More Telugu News