rOJA: రోజాను మహిళ అని ఎవరూ అనుకోవడం లేదు: కూన రవికుమార్

  • అసెంబ్లీ సమావేశాల్లో రోజా పనులను దగ్గరుండి చూశామన్న కూన
  • రోజా మాట్లాడేవి చాగంటి గారి ప్రవచనాలా? అని ఎద్దేవా 
  • ప్రజా పోరాటం ఉద్ధృతమైతే పోలీసులు కూడా నిలవలేరని హెచ్చరిక
No one is treating Roja as woman says Kuna Ravi Kumar

ఏపీ మంత్రి రోజాపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా ప్రవర్తనను చూసి మహిళలంతా సిగ్గు పడుతున్నారని ఆయన అన్నారు. రోజాను ఎవరూ మహిళగా చూడటం లేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాల్లో రోజా చేసిన పనులను దగ్గరుండి చూశామని తెలిపారు. రోజా మాట్లాడేవి చాగంటి గారి ప్రవచనాలా? అని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఎంత నీచంగా మాట్లాడుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 

ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమయిందని... ప్రజా తిరుగుబాటును జగన్ కాదు కదా, జగన్ తాత కూడా ఆపలేరని అన్నారు. ప్రజల పోరాటం ఉద్ధృతమైతే పోలీసులు కూడా నిలవలేరని హెచ్చరించారు. పౌర హక్కుల విషయంలో పాకిస్థాన్ కు, ఏపీకి తేడా లేదని చెప్పారు. పూర్తిగా టీడీపీపైనే దృష్టి సారించిన పోలీసులు... శాంతిభద్రతలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. పోలీసులు బాధ్యతలను మరిచి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

More Telugu News