సోనియాకు కానుకగా తన కొత్త కుటుంబ సభ్యుడిని పరిచయం చేసిన రాహుల్ గాంధీ!
- గోవా నుంచి రెండు పెంపుడు కుక్క పిల్లలను తెచ్చుకున్న రాహుల్
- అందులో ఒకదాన్ని తల్లికి బహుమతిగా ఇచ్చిన
కాంగ్రెస్ అగ్రనేత - దానికి నూరీ అని పేరు పెట్టినట్టు వెల్లడి
తన వెంట తీసుకెళ్లిన ఆడ కుక్క పిల్లకు నూరీ అని పెట్టారు. దాన్ని నేరుగా తన ఇంటికి వెళ్లి తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చారు. కుక్కపిల్ల బాగుందన్న సోనియా దానితో ఆడుకున్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న మరో కుక్కపిల్లతో నూరీ కలిసిపోయి ఆడుకుంటోంది. గోవాలో కుక్కల పెంపక కేంద్రానికి వెళ్లిన దగ్గరి నుంచి నూరీని తనతో పాటు తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇవ్వడం వరకూ రూపొందించిన వీడియోను రాహుల్ ఈ రోజు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా తన యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేశారు.