అన్ని నగరాల్లో 33 శాతం.. ఒక్క హైదరాబాద్‌లోనే 261 శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం
- సిటీకి క్యూ కడుతున్న ప్రపంచ ప్రముఖ సంస్థలు
- ఆఫీస్ స్పేస్‌కు భారీగా పెరిగిన డిమాండ్
రియల్టీ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ తాజా నివేదిక ప్రకారం, నగరంలో ఏడాది కాలంలో 3.1 మిలియన్ చదరపు అడుగులు ఆఫీస్ స్పేస్ ను ప్రముఖ కార్పొరేట్ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఓవరాల్ ఆఫీస్ స్పేస్ లీజులో ముంబై (3.3 మిలియన్ ఎస్ఎఫ్టీ), బెంగళూరు (3.2 మిలియన్ ఎస్ఎఫ్టీ) తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు నగరాలు త్రైమాసికంలో మొత్తం లీజింగ్ లావాదేవీల్లో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, బెంగళూరులో బడా కంపెనీలతో భారీ మొత్తం స్పేస్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.