Gold Rate: ఆరు నెలల కనిష్ఠ స్థాయికి బంగారం ధరలు.. కారణం ఇదే!

  • హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,600
  • అమెరికన్ డాలర్ రేటు పెరగడమే దీనికి కారణం
  • రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ రేట్స్ అస్థిరంగానే ఉంటాయంటున్న ట్రేడ్ వర్గాలు
Gold rates in Hyderabad decline to six months low

హైదరాబాద్ లో బంగారం ధరలు బాగా తగ్గాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి గోల్డ్ రేట్స్ పడిపోయాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 52,600గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,380గా ఉంది. అమెరికా డాలర్ విలువ పెరగడమే బంగారం ధరలు తగ్గడానికి కారణం. కీలక వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు డాలర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో... అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేటు పెరిగిపోతోంది. దీని కారణంగా గోల్డ్ రేట్ లో కరెక్షన్స్ చోటుచేసుకుంటున్నాయి. 

జూన్ 29న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,850గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750గా ఉంది. ప్రస్తుత రేట్లతో ఈ ధరను పోల్చుకుంటే బంగారం ధర భారీగానే తగ్గినట్టు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు అస్థిరంగానే ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అధిక ద్రవ్యోల్బణం కారణంగా కీలక వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడమే దీనికి కారణమని చెపుతున్నారు.

More Telugu News