అగ్రరాజ్యంలో అంబేద్కర్ కు అరుదైన గౌరవం.. భారత్ అవతల అతి పెద్ద విగ్రహం ఏర్పాటు
- మేరీల్యాండ్‌లో 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్
- ఇందులో 19 అడుగుల మేర విగ్రహం ఏర్పాటు
- ఈనెల 14న ఆవిష్కరణ
మేరీల్యాండ్‌లోని అకోకీక్ నగరంలో 13 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో భాగంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’గా నామకరణం చేసిన ఈ విగ్రహాన్ని అక్టోబరు 14న ఆవిష్కరించనున్నారు.
ఈ స్మారక చిహ్నం అంబేద్కర్ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. సమానత్వం, మానవ హక్కులకు చిహ్నంగా దీన్ని చూస్తున్నట్లు ఏఐసీ వివరించింది. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఏఐసీ తెలిపింది. గుజరాత్‌లోని సర్దార్ పటేల్ విగ్రహాన్ని డిజైన్ చేసిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు.