ఢిల్లీలో కలకలం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లపై పోలీసుల దాడి
- న్యూస్ క్లిక్ పోర్టల్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు
- విదేశీ నిధుల మోసం జరిగిందని సంస్థపై ఈడీ కేసు
- పోర్టల్ కు చైనాతో సంబంధాలున్నాయని ఆరోపణ
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల మేర విదేశీ నిధుల మోసం జరిగిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఆ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. కాగా, చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్వర్క్ లో ఈ సంస్థ కూడా భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో కథనం ప్రచురించింది.